క్రైంBreaking Newsతెలంగాణ

TG News : మావోయిస్టు సిద్ధాంతకర్త, పార్టీకి బ్యాక్ బోన్.. పాఠాలు నేర్పిన ఆమె లొంగిపోయారు..!

TG News : మావోయిస్టు సిద్ధాంతకర్త, పార్టీకి బ్యాక్ బోన్.. పాఠాలు నేర్పిన ఆమె లొంగిపోయారు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ఆమె ఎన్నో సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తుంది. మావోయిస్టు పార్టీకి బ్యాక్ బోన్ గా ఉంది. కొత్తవారికి మావోయిస్టు భావజాల క్లాసులు చెప్పేది. కానీ ఇప్పుడు ఆమె తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయింది.

రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు కృషి వల్ల ఓ మావోయిస్టు స్టేట్ కమిటీ మెంబర్ తో పాటు ఏరియా కమిటీ మెంబర్ లొంగిపోయారన్నారు.

లొంగిపోయిన వారిలో స్టేట్ కమిటీ మెంబర్ కాకరాల సునీత అలియాస్ బద్రి ఏరియా కమిటీ మెంబర్ హరీష్ ఉన్నారని చెప్పారు. లొంగిపోయిన సునీత పార్టీ సిద్ధాంత కర్తగా, పార్టీ బ్యాక్ బోన్ గా పని చేశారని, పార్టీ బలోపేతానికి ఆమె కృషి చేశారని, పార్టీలో కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వారికి పార్టీ భావజాలం గురించి క్లాసులు చెప్పారని తెలిపారు.

సునీత మొత్తం ఐదు ఎన్కౌంటర్ లలో పాల్గొన్నారని, క్రాంతి అనే మావోయిస్టు పార్టీ మ్యాగజీన్ కు ఆర్టికల్స్ రాసారని, సునీత పై ఇరవై లక్షల రివార్డ్ ఉంది..ఆ రివార్డ్ ఆమెకు ఇచ్చేస్తం అన్నారు.

జనజీవన స్రవంతిలోకి రావాలన్న పోలీసుల విజ్ఞప్తి మేరకు ఇద్దరు మావోయిస్టు లొంగిపోయారని, మావోయిస్టులు తమ గ్రామాలకు తిరిగి వస్తే, తెలంగాణ ప్రభుత్వం వారికి పునరావాసం కల్పిస్తుందన్నారు.


మావోయిస్టులు స్వతంత్ర జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని,
ప్రస్తుత యువతరం మావోయిస్టులకు దూరంగా ఉందన్నారు.

పార్టీలోకి నియామకాలు దాదాపు పూర్తిగా ఆగిపోయాయి, ఏ విద్యార్థి కూడా మావోయిస్టు పార్టీలో చేరడం లేదని, మావోయిజం ఒక కాలం చెల్లిన భావజాలం, మావోయిస్టులకు ఇదే మా విన్నపం “ఆయుధాలు వదిలి రహస్య జీవితాన్ని వదిలివేయండి – ప్రజల ప్రధాన స్రవంతిలో చేరండి” ఆన్నారు.

సునీత చెల్లెలు మాధవి కూడా ఇంకా మావోయిస్టు పార్టీలో ఉన్నారని, ఆమెను కూడా జన జీవన స్రవంతిలోకి రావాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి కలవడానికి ముందుకు వస్తున్నారని, జన జీవన స్రవంతి లోకి వచ్చే వారికి వారిపై ఉన్న రివార్డులు వారికి ఇస్తాం వారికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు.

ఇప్పటి వరకు 387మంది జన జీవన స్రవంతిలో కలిశారని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం లో తీసుకునే చర్యలు, యూత్ ఇప్పుడు మావోయిస్టు పార్టీ వైపు వెళ్లడం లేదన్నారు.

MOST READ : 

  1. ACCIDENT : డివైడర్ మధ్య అడ్వర్టైజ్ బోర్డులతో రెండు నిండు ప్రాణాలు బలి..!

  2. Holidays : విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త.. వరుసగా 13 రోజులు సెలవులే..!

  3. Job Mela : నిరుద్యోగులకు సువర్ణ అవకాశం.. జాబ్ మేళా ఎప్పుడంటే..!

  4. District collector : యూరియా పంపిణీపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. వ్యవసాయ అధికారులతో సమీక్ష..!

  5. MLC Addanki : డాక్టరేట్ అందుకున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్..!

మరిన్ని వార్తలు