TOP STORIESBreaking Newsజాతీయంవ్యవసాయం

PMKY : రైతుల ఖాతాలలోకి రూ.18 వేలు.. ఇలా చేస్తే చాలు.. లేటెస్ట్ అప్డేట్..!

PMKY : రైతుల ఖాతాలలోకి రూ.18 వేలు.. ఇలా చేస్తే చాలు.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ సహాయం ఏడాదికి మూడు విడతలుగా 6000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఇటీవల ఆగస్టు 2వ తేదీన 20వ విడత ప్రధానమంత్రి కిసాన్ పథకం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

కాగా చాలా మందికి ఖాతాలలో డబ్బులు రాలేదని ఆందోళన చెబుతున్నారు. ఈ ఒక్క విడత మాత్రమే కాకుండా గతంలో కూడా తమ ఖాతాలోకి డబ్బులు రావడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 11వ విడత 2022 వరకు మాత్రమే రైతులకు పిఎంకేవై నిధులు ఖాతాలలో జమ అయ్యి.. అప్పటినుంచి ఇప్పటివరకు నిధులు రాని రైతులకు శుభవార్త తెలియజేసింది.

ఇప్పటి వరకు 9 విడతలుగా ప్రధానమంత్రి కిసాన్ నిధులు రాలేదు. వారందరికీ కూడా సరైన పత్రాలు అందజేస్తే ఒకేసారి 9 విడుదలకు సంబంధించి 18 వేల రూపాయలను ఖాతాలలో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాధ్ ఠాగూర్ తెలిపారు. ఆధార్ సీడింగ్, కేవైసీ, ఇతర పత్రాలను సరి చేయాల్సి ఉంది. వాటిని సరిచేసిన వెంటనే ఒక్కొక్క రైతు ఖాతాలో 18 వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వేయనున్నది.

ఎందుకు పెండింగ్ లో ఉన్నాయంటే :

ప్రధానమంత్రి కిసాన్ నిధి డబ్బులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయంటే.. 2022 నవంబర్ 12వ విడత నుంచి రైతులు వ్యవసాయ పొలంలో తప్పనిసరిగా పంట వేయడంతో పాటు ఆధార్ సీడింగ్, కేవైసీ తప్పనిసరి చేయించుకోవాల్సి ఉంది. అవి చేయని రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేయలేదు. ఇప్పుడు అన్ని పత్రాలు సరిచేసిన రైతులకు పెండింగ్‌లో ఉన్న డబ్బులు ఖాతాలలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

MOST READ : 

  1. District collector : భూ భారతి పై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఆ సమస్యలు ఆర్డీవో పరిధిలోనే పరిష్కారం..!

  2. TG News : మావోయిస్టు సిద్ధాంతకర్త, పార్టీకి బ్యాక్ బోన్.. పాఠాలు నేర్పిన ఆమె లొంగిపోయారు..!

  3. Mosquito : దోమల ద్వారా వచ్చే వ్యాధులేంటో.. ఎప్పుడొస్తాయో తెలుసా.. సర్వేలో ఆసక్తికర విషయాలు..!

  4. Aadhaar Cards : ఆధార్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్.. సవరణలకు కేంద్రాల ఏర్పాటు..!

  5. Urea : ఒక్క బస్తా యూరియా ఇవ్వండి సార్.. పిఎసిఎస్ సిబ్బంది కాళ్లు మొక్కుతన్న రైతులు.. (వీడియో)

మరిన్ని వార్తలు