Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతుల క్యూ.. ఒక్క బస్తా కూడా దొరక్క ఇక్కట్లు..! 

Miryalaguda : యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతుల క్యూ.. ఒక్క బస్తా కూడా దొరక్క ఇక్కట్లు..! 

మిర్యాలగూడ/వేమలపల్లి, మన సాక్షి:

పంటలు సాగు చేసి నెలలు గడుస్తున్న రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామంలో రెండు ఆగ్రో కేంద్రాలకు 20 టన్నుల యూరియా వచ్చింది.

విషయం తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచే ఆధార్ కార్డుతో క్యూ లైన్ లో వేచి ఉన్నారు. వచ్చిన లోడు వచ్చినట్టు ఖాళీ అవుతుండడంతో ముందు వచ్చిన వాళ్లకు మాత్రమే యూరియా దక్కుతుంది. మిగిలిన రైతులు నిరాశగా వెను తిరిగి వెళ్లే పరిస్థితి ఎదురవుతుంది. ఆగ్రో కేంద్రంలో ఒక రైతుకు ఒక యూరియా బస్తా అందజేశారు.

గతంలో ఎన్నడు లేని విధంగా యూరియా కోసం క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. ఆగ్రో కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా పోలీసు వారు బందోబస్తు చేపట్టారు.

MOST READ :

  1. Food Safety : ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీ.. నిల్వ ఉంచిన చికెన్ దుర్వా సన.. రెండు రెస్టారెంట్లకు నోటీసులు..!

  2. Health : ఆరోగ్య సేవల్లో సరికొత్త అధ్యాయం.. ఐఐహెచ్ హెల్త్‌కేర్ ‘కేర్. ఫర్ గుడ్’ బ్రాండ్..!

  3. Health : ఆరోగ్య సేవల్లో సరికొత్త అధ్యాయం.. ఐఐహెచ్ హెల్త్‌కేర్ ‘కేర్. ఫర్ గుడ్’ బ్రాండ్..!

  4. Food Safety : ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీ.. నిల్వ ఉంచిన చికెన్ దుర్వా సన.. రెండు రెస్టారెంట్లకు నోటీసులు..!

మరిన్ని వార్తలు