Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి..!

పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి :

ఉద్యోగాలు ఇప్పిస్తామని జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష, శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని ఏ ప్రభుత్వ శాఖ పరిధిలో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతులలో నియామకాలు జరగడం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఒకవేళ వివిధ అవసరాల పై తాత్కాలిక ప్రాతిపదికన ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతులలో నియామకాలు చేపడితే కలెక్టర్ ఆధ్వర్యంలో అర్హతలు పరిశీలించి, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతులలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది దళారులు అమాయకుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, నియామక ప్రక్రియలో డబ్బుకు, సిఫార్సులకు ఎక్కడ ఆస్కారం ఉండదని, ప్రజలు ఎవరు అనవసరంగా దళారులను నమ్మి మోసపోవద్దని, అనవసరంగా డబ్బును కోల్పోవద్దని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతుల క్యూ.. ఒక్క బస్తా కూడా దొరక్క ఇక్కట్లు..! 

  2. Green Banana : పచ్చి అరటికాయ తినొచ్చా.. ఎలా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం.. తెలుసుకుందాం..!

  3. TG News : తెలంగాణలో రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించిన అల్ట్రావయొలెట్..!

  4. Banana : తొక్కే కదా అని తీసిపడేస్తున్నారా.. ఏం చేయాలో తెలిస్తే అస్సలూ వదలరు..!

మరిన్ని వార్తలు