Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం.. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!

Miryalaguda : నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం.. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!

మిర్యాలగూడ మన సాక్షి

నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలపాల అడ్డుకట్ట వేయుటకు సిసిటీవీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.

మిర్యాలగూడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన దాదాపు100 సీసీటీవీ కెమెరాలను స్థానిక యమ్.ఎల్.ఏ బత్తుల లక్షా రెడ్డి, యమ్.ఎల్.సి శంకర్ నాయక్, జాయింట్ కలెక్టర్ అమిత్ నారాయణతో కలసి పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని ప్రధాన కూడలిలో, కాలనీలలో ఏర్పాటు చేసిన ఈ సిసిటీవీ కెమెరాలను పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందనీ తెలిపారు. ప్రజా రక్షణే ద్వేయంగా పోలీస్ శాఖ నేర నియంత్రణ, మెరుగైన సమాజ నిర్మాణం కొరకు సిసి కెమెరాల ఎంతో దోహదపడతాయని తెలిపారు.

జిల్లాలో అనేక కేసులును ఛేదించడంలో, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సిసిటివి కెమెరాల ద్వారా నిందితులను గుర్తించినమని తెలిపారు. ప్రతి కాలనీలో వ్యాపార సముదాయాల్లో గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని అప్పుడే నేరాలను నియంత్రించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు.

?ఈ సందర్భంగా పట్టణ వ్యాపార సముదాయాల యజమానులు మరిన్ని నూతన సిసిటివి కెమరాలను ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పోలీసు శాఖ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి పరిశీలించి పలు రికార్డులు తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, 2 టౌన్ సీఐ రామనర్సయ్య,1 టౌన్ సీఐ నాగభూషణ్, రూరల్ సీఐ పి.యన్. డి ప్రసాద్, యస్.ఐలు, సిబ్బంది స్థానిక వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Bandi Sanjay : ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచిపెడతారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

  2. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.. లభించని మరో ముగ్గురు చిన్నారుల ఆచూకీ..!

  3. District collector : జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ కీలక ఆదేశాలు.. ఆ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..!

  4. District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన..!

  5. TG News : తెలంగాణలో రైతులకు భారీ శుభవార్త..!

మరిన్ని వార్తలు