Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : పాతబస్తీ వినాయక విగ్రహం వద్ద ఉద్రిక్తత.. మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్న వర్షిత్ రెడ్డి, అరెస్ట్..!

Nalgonda : పాతబస్తీ వినాయక విగ్రహం వద్ద ఉద్రిక్తత.. మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్న వర్షిత్ రెడ్డి, అరెస్ట్..!

నల్లగొండ, మన సాక్షి :

గణేష్ నిమజ్జనం సందర్భంగా హనుమాన్ నగర్ లోని మొదటి వినాయకుని వద్ద పూజలు జరిపి శోభాయాత్రను ప్రారంభించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకు వచ్చి పూజలు జరిపిన అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై తనను ఆహ్వానించలేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు వర్షిత్రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకొని తన అనుచరులతో ఆందోళన చేశారు. దీంతో మంత్రి అనుచరులు మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి తదితరులు బిజెపి నాయకులకు ఎదురేగి వారితో తీవ్ర వాగ్వివాదం చేయడంతో తోపులాట జరిగింది ,దీంతో పోలీసులు బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ని అరెస్ట్ చేసి కారులో బలవంతంగా ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.

అయితేబి ఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చర్ల భూపాల్ రెడ్డి ని కూడా ఆహ్వానించకపోవడంతో ఆయన అనుచరులు కూడా మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన అభివృద్ధి పనులను వివరిస్తుండగా ఇది రాజకీయ సభ కాదు దేవుని దగ్గర రాజకీయాలు చేయవద్దంటూ ఆయన ప్రసంగాన్ని బిజెపి నాయకులు బీఆర్ఎస్ నాయకులు అడుగడుగునా అడ్డుకొని ఆందోళన చేయడంతో పోలీసులు మంత్రిని వెనక వైపు నుండి నుండి పంపించారు. కాసేపటికి బిజెపి అధ్యక్షుడు వర్షిత్ రెడ్డిని పోలీసులు విడుదల చేయడంతో ఉద్రిక్తత చల్లారింది.

MOST READ : 

  1. Drinking Water : ఖాళీ బిందెలతో త్రాగినీటి కోసం మహిళలు పంచాయతీ కార్యాలయం ముట్టడి..!

  2. ACB : రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జిల్లా మత్స్యశాఖ అధికారిని..!

  3. Bandi Sanjay : ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచిపెడతారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

  4. Ganesh Laddu : శంకర్‌పల్లి రుద్ర యూత్ గణేష్ లడ్డు రూ.1,11,011..!

మరిన్ని వార్తలు