District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులో అలా చేయాలి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులో అలా చేయాలి..!
జగిత్యాల, (మన సాక్షి) :
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కథలాపూర్ మండలంలోని అంబర్ పేట, చింతకుంట, భూషణరావుపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు, గ్రామపంచాయతీ హెల్త్ సెంటర్ భవన పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కు అర్హులైన లబ్ధిదారులను కలిసి నిర్మాణ పనులు మొదలు పెట్టని వారు ఉన్నట్లయితే వారిని వెంటనే మొదలు పెట్టించాలి ఇంటి నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. గ్రామంలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని ఎన్ని గ్రౌండ్లింగ్ వరకు వచ్చాయని ఎన్ని స్లాబ్ దశకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారికి సెర్ప్, మెప్మా ద్వారా రుణాలు మంజూరయ్యేలా చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని అందుకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేవలం రవాణా కూలీల వేతనాలు మాత్రం లబ్ధిదారులు చెల్లిస్తే ఇసుక ఉచితంగా సమకూరుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డిఓ జీవాకర్ రెడ్డి, ఈ పి ఆర్ ఓ లక్ష్మణ్ రావు జిల్లా హౌసింగ్ పిడి ప్రసాద్ ఎమ్మార్వోలు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ.. ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్..!
-
Heavy Rain : తెలంగాణలో మరో మూడు గంటల్లో భారీ వర్షం.. ఆ జిల్లాల్లో అలెర్ట్..!
-
Aadhaar Centers : మనసాక్షి కథనానికి స్పందన.. దేవరకొండలో ఆధార్ కేంద్రాలలో అధిక రుసుము వసూళ్లపై అధికారుల విచారణ…!
-
Water Well : బావులు గుండ్రంగానే ఎందుకు ఉంటాయి.. కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
-
Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!









