Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణ

Karimnagar : ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..!

Karimnagar : ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..!

కరీంనగర్, మనసాక్షి:

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని
ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తపల్లి మండల పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రేకుర్తికి చెందిన బొమ్మేన్ వార్ నారాయణ (43) కూలి పని చేస్తూ..జీవనం సాగించేవాడు.

శనివారం భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్థాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే గత సంవత్సరా కాలంగా మద్యానికి బానిసకావడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని మృతురాలి భార్య తెలిపింది.

దింతో నారాయణ భార్య కొంత కాలంగా కరీంనగర్ లో తన తల్లి వద్దే నివాసం ఉంటున్నట్లు తెలిపింది. శనివారం సాయంత్రం అతడు మద్యం సేవించి కరీంనగర్ లో ఉంటున్నా తన భార్య వద్దకు వెళ్లి గొడవ పడ్డాడు. అనంతరం రేకుర్తి సింహాద్రి కాలనిలో తన ఇంటికి వెళ్లి రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉదయం రేకుర్తి లోని తన ఇంటికి వచ్చిన భార్య గేటు తీసి చూసేసరికి బాత్రూం ముందు ఉన్న మెట్ల రిలింగ్ కు ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించి ఇరుగుపొరుగు వారికీ తెలిపింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమార్తె ఉంది.

MOST READ : 

  1. Big Twist : పట్టపగలు దారిదోపిడిలో బిగ్ ట్విస్ట్.. ఏడుగురి అరెస్ట్..!

  2. Hydra : రూ.500 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా.. ప్రహరీ, షెడ్ తొలగింపు..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులో అలా చేయాలి..!

  4. Nalgonda : అధిక ధరలకు యూరియా విక్రయం.. అధికారుల తనిఖీ.. పోలీసులు కేసు నమోదు..!

మరిన్ని వార్తలు