Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Big Twist : పట్టపగలు దారిదోపిడిలో బిగ్ ట్విస్ట్.. ఏడుగురి అరెస్ట్..!

Big Twist : పట్టపగలు దారిదోపిడిలో బిగ్ ట్విస్ట్.. ఏడుగురి అరెస్ట్..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పరిధిలోని కొత్తపల్లి, హుస్సేన్ పూర్ గ్రామ శివారులో 12వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం దారి దోపిడీ జరిగి రూ. 40 లక్షలు గుర్తుతెలియని దుండగులు తీసుకొని పారిపోయిన విషయం తెలిసిందే. పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి జడ్చర్లలో అర్ధరాత్రి ఏడుగురు నిందితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ వికారాబాద్ లోని జనతా స్టీల్ షాప్ నుంచి రూ. 40 లక్షలు తీసుకొని రావాలని స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ మధు సాయిబాబాలకు చెప్పాడు.

ఈ విషయాన్ని మధు నగదులు తీసుకొస్తున్న విషయాన్ని తన గ్యాంగ్ కు ముందే చెప్పినాడు. వ్యాపారులను ఫాలో అయినట్టు దుండగులు నటించారు. హుస్సేన్ పూర్ కు రాగానే మధు సాయి బాబా లపై దాడి చేసినట్లు నటించి నగదుతో దుండగులు కారులో పరారయ్యారు.

కొత్తపల్లి గ్రామానికి రాగానే అతివేగం కారణంగా కారు బోల్తా పడి రూ. 9 లక్షలు అక్కడే వదిలేసి పరారయ్యారు. కారు డ్రైవర్ పైనే అనుమానం ఉందని వ్యాపారి రాకేష్ పేర్కొన్నారు. విచారణలో మధు నేరాన్ని ఒప్పుకున్నాడు.

కాసుల మధు (27), తెల్లాపురం విజయ్ కుమార్ (35), మహమ్మద్ అజర్ (44), సలీన్ హర్షవర్ధన్ (29), ముళ్ళ శామీం (26), బాంద్ర అనుదీప్ (25), చెరుకుల దీపక్ (25) లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్, నార్సింగి ఏసిపి వెంకటరమణ గౌడ్, సిఐ శ్రీనివాస్ గౌడ్, పోలీసు సిబ్బందిలను కమిషనర్ అభినందించారు.

MOST READ:

  1. Nalgonda : రూ.232 కోట్లతో పోలీసు అధికారులకు, సిబ్బందికి క్వార్టర్స్..!

  2. Heavy Rain : భారీ వర్షం.. నదిని తలపిస్తున్న రహదారి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..! 

  3. Hydra : రూ.500 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా.. ప్రహరీ, షెడ్ తొలగింపు..!

  4. Urea : యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు.. మహిళ చేతి వేళ్లకు తీవ్ర గాయం..!

మరిన్ని వార్తలు