తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Sub Collector : మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. ఇసుక ట్రాక్టర్ సీజ్..!

Sub Collector : మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. ఇసుక ట్రాక్టర్ సీజ్..!
మిర్యాలగూడ, మనసాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ బుధవారం ఇసుక రీచ్ లను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న ఒక ట్రాక్టర్ ను సీజ్ చేశారు. వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామం నుండి ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ యాద్గార్పల్లి సమీపంలో పట్టుకున్నారు. రూరల్ పోలీసులకు అప్పగించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అక్రమ కార్యక్రమాలలో పాల్గొనకూడదని, భవిష్యత్తులో నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సహజ వనరులను సంరక్షించడంలో ప్రజలు సహకరించాలని కోరారు. వారి వెంట డిఎస్పి రాజశేఖర్ రాజు తో పాటు తాసిల్దార్ సురేష్, రూరల్ ఎస్సై కృష్ణయ్య ఉన్నారు.
MOST READ :
-
ACB : విద్యుత్ ఏడిఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రెండు కోట్లు గుర్తింపు..!
-
Godavarikhani : డిగ్రీ చదువుతూ.. జల్సాలకు అలవాటు పడి.. పోలీసులకు చిక్కాడు ఇలా..!
-
District collector : నిరుద్యోగులకు జిల్లా కలెక్టర్ శుభవార్త.. 19న జాబ్ మేళా..!
-
Dost : దోస్త్ ద్వారా రేపు డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు..!









