Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Sub Collector : సబ్ కలెక్టర్ కీలక ఆదేశాలు.. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..!

Sub Collector : సబ్ కలెక్టర్ కీలక ఆదేశాలు.. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

కొత్తగా నియమించబడిన జిపిఓలు బాధ్యతాయుతంగా తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కొత్తగా నియమించబడిన జిపిఓ లకు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

ప్రజా సంక్షేమం, రెవెన్యూ శాఖ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని జీపీవోలు పనిచేయాలని పలు సూచనలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సమర్ధవంతంగా చేరేలా అంకితభావంతో నిజాయితీతో పని చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డి ఏ ఓ శ్రీనివాస్ శర్మ తాసిల్దార్లు సురేష్ , కృష్ణయ్య, రఘు తదితరులు పాల్గొన్నారు.

బూత్ స్థాయి అధికారులతో సమీక్ష :

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బూత్ స్థాయి అధికారులతో బుధవారం స్థానిక సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక విశేష సవరణ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సూచనలు జారీ చేశారు. సమావేశంలో డి ఏ ఓ తాసిల్దారులు బిఎల్ఓ సూపర్వైజర్లు డిప్యూటీ తాసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Clear Tax : ఏఐ ద్వారా 50వేలకు పైగా ప్రాంతీయ భాషల్లో పన్నుల దాఖలు..!

  2. Godavari khani: భార్యను హత్య చేసిన భర్త.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

  3. Penpahad : యూరియా కోసం రహదారిపై మహిళా రైతుల ధర్నా..!

  4. Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్‌మెన్ ఘనకార్యం.. ఆలస్యంగా వెలుగులోకి..!

మరిన్ని వార్తలు