Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District collector : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..!

District collector : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణ పేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఉండాలని ఆమె వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారులతో జిల్లా ఆసుపత్రి/ మెడికల్ కళాశాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ ఆసుపత్రి/కళాశాలలో త్రాగునీటికీ ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. సిటీ స్కాన్ పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. నర్సింగ్ హాస్టల్, మెడికల్ కాలేజీ హాస్టల్ అద్దె, తదితర వాటి పనులపై దృష్టి సారించాలన్నారు. టీ హబ్ ప్రారంభించాలని ఆదేశించారు.

ఆస్పత్రి లోని అన్ని విభాగాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ డాక్టర్ మల్లికార్జున్, వివిధ విభాగాల వైద్య నిపుణులు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Sub Collector : సబ్ కలెక్టర్ కీలక ఆదేశాలు.. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..!

  2. Clear Tax : ఏఐ ద్వారా 50వేలకు పైగా ప్రాంతీయ భాషల్లో పన్నుల దాఖలు..!

  3. Penpahad : యూరియా కోసం రహదారిపై మహిళా రైతుల ధర్నా..!

  4. Snails : మీ తోటలో నత్తల బెడద ఉందా.. శాశ్వత పరిష్కారం మీకోసం..!

మరిన్ని వార్తలు