District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. దీర్ఘకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి శ్రీకారం..!

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. దీర్ఘకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి శ్రీకారం..!
సూర్యాపేట, మనసాక్షి :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూభారతి చట్టం- 2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా సాదా దస్తావేజు భూములను రెగ్యులరైజేషన్ చేసి అర్హులైన రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుండి జిల్లాలోని నూతనకల్, మద్దిరాల మండలాల్లో పైలెట్ పద్ధతిన దీర్ఘకాల భూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రామాల వారీగా షెడ్యూల్ జారీ చేస్తామని ఆ ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో అనేక మంది రైతులు సాదా దస్తావేజులు, కాగితాల ద్వారా భూములను కొనుగోలు చేశారని, అలాగే సీలింగ్ పట్టాదారుల నుండి భూములు కొనుగోలు చేసి అప్పటినుండి అలాంటి భూములను నిరంతరం సాగు చేస్తూ సంబంధిత రెవెన్యూ రికార్డులలో అనుభవదారులుగా నమోదు అవుతూ వస్తున్నారని,
అలాంటి వారికి శాశ్వతంగా సమస్యను పరిష్కరించి సాగు హక్కులను, చట్టబద్ధత కల్పించేందుకు భూ రికార్డులను సమగ్రంగా డిజిటలైజేషన్ చేసేందుకు భూ భారతి చట్టం- 2025 ప్రకారం సాదా దస్తావేజు భూములను రెగ్యులరైజేషన్ చేసి అర్హులైన రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాలు జారీచేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.
భూ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసే సమయంలో రైతులు సహకరించాలని కలెక్టర్ కోరారు. ప్రజలు భూమికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా సంబంధిత తహసిల్దార్ కార్యాలయంలో సరైన దస్తావేజులతో సంప్రదించాలని తెలిపారు.
MOST READ :
-
Task Force : టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు.. నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ పట్టివేత..!
-
Hyderabad : కోకాపేట్ లో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య..!
-
TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాతృత్వం.. ఆ విద్యార్థికి జీవితం..!
-
Sub Collector : సబ్ కలెక్టర్ కీలక ఆదేశాలు.. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..!
-
Snails : మీ తోటలో నత్తల బెడద ఉందా.. శాశ్వత పరిష్కారం మీకోసం..!









