Miryalaguda : నల్గొండ జిల్లాలో రూ.200 కోట్ల యూరియా కుంభకోణం.. అక్రమాలకు హబ్ గా మిర్యాలగూడ..!

Miryalaguda : నల్గొండ జిల్లాలో రూ.200 కోట్ల యూరియా కుంభకోణం.. అక్రమాలకు హబ్ గా మిర్యాలగూడ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా లో 200 కోట్ల రూపాయల యూరియా కుంభకోణం జరిగిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న యూరియాను అక్రమంగా దారి మళ్లిస్తూ మిర్యాలగూడ ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారని ఆరోపించారు.
వాటాల పంపిణీలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన రెండు కోట్ల రూపాయలను ఇచ్చారని, రైతుల బాగోగుల గురించి ఇస్తున్నట్లుగా నాటకం ఆడినట్లు ఆయన పేర్కొన్నారు. యూరియా కుంభకోణంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి నిజానిజాలు రాబట్టాలని, మిర్యాలగూడ ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డిని సీఎం వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
బత్తుల లక్ష్మారెడ్డి నల్లగొండ జిల్లా రైతులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు యూరియా పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అదే విధంగా జానారెడ్డి, ఇద్దరు తనయులు ఒక గూడ్స్ ట్రైన్ యూరియాను దారి మళ్లించి నాగార్జునసాగర్ కు తరలించారని ఆరోపించారు. 266 రూపాయలకు యూరియా బస్తాను అందించాల్సింది పోయి కొన్నిచోట్ల 500 రూపాయలకు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని, కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిందని ఆరోపించారు.
రాష్ట్రానికి, ఢిల్లీకి మూటలు మోసేందుకే కుంభకోణాలు చేస్తున్నారని, మిర్యాలగూడను కమిషన్ హబ్ గా చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో 11 స్థానాలు గెలిచిన ఏ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో బిజెపి నాయకులు సాధినేని శ్రీనివాసరావు, బంటు సైదులు, సత్య ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Hyderabad : ఎయిర్ పోర్టు లో భారీగా హైడ్రో ఫోనిక్ పదార్థాల పట్టివేత..!
-
Hyderabad : కోకాపేట్ లో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య..!
-
Red Rice : రెడ్ రైస్ తింటే ఆరోగ్యమేనా.. చాలా మంది ఇష్టపడుతున్నది అందుకేనా.. తెలుసుకుందాం..!
-
Godavarikhani : డిగ్రీ చదువుతూ.. జల్సాలకు అలవాటు పడి.. పోలీసులకు చిక్కాడు ఇలా..!









