Post Office : తపాలా శాఖ కొత్త పథకాలు.. బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేట్లు..!

Post Office : తపాలా శాఖ కొత్త పథకాలు.. బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేట్లు..!
ఆర్మూర్, మన సాక్షి
ఆర్మూర్ డివిజన్ తపాలా శాఖ అధికారి బి. కిషన్ నాయక్ శనివారం ప్రకటించిన ప్రకారం, భారత తపాల శాఖ కొత్త పథకాలు తీసుకొచ్చింది. బ్రిటిష్ కాలంలో ఉన్న రిజిస్టర్ పోస్టును స్పీడ్ పోస్టులో విలీనం చేసి, దేశమంతటా ఏకైక టారిఫ్ విధించారు. అక్టోబర్ 1 నుంచి ఓటీపీ ఆధారిత డెలివరీ ప్రారంభమై, ప్యాకేజీ అందజేసేటప్పుడు చిరునామాదారుకే ఓటీపీ ద్వారా ధృవీకరణ తీస్తారు.
స్పీడ్ పోస్టు ఛార్జీలు దూరం, బరువు ఆధారంగా పెరిగి, 50 గ్రాముల లోకల్ పార్సెల్ రూ.19 నుంచి మొదలవుతాయి. 250 గ్రాముల వరకు, 2 వేల కిలోమీటర్ల పరిధిలో వివిధ చార్జీలు విధించారు. జీఎస్టీ కాకుండా ఆర్టికల్‌కు రూ.5 అదనపు వసూలు ఉంటుంది. విద్యార్థులకు స్పీడ్ పోస్టుపై 10% తగ్గింపు మరియు బల్క్ సేవలకు 5% ప్రత్యేక రాయితీ లభిస్తుంది.
పోస్ట్ ఆఫీస్‌లో అన్ని రకాల డిపాజిట్లపై జాతీయ బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేట్లు, సీనియర్ సిటిజనులకు ప్రత్యేక సేవింగ్ స్కీమ్స్, కిషోర్ బాలికలకు సుకన్య సమృద్ధి యోజన, ప్రైవేటు ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు పోస్టల్ లైఫ్ఇన్సూరెన్స్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం మీ గ్రామంలోని పోస్ట్ ఆఫీస్‌ను సంప్రదించవచ్చు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యం పై దృష్టి సారించాలి..!
-
Tea Snacks : టీతో ఈ స్నాక్స్ కలిపి తినకూడదు.. కారణం ఏంటంటే..!
-
Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!
-
Croma : పండగ సీజన్ భారీ ఆఫర్స్.. ఏఏ వస్తువులకు.. ఎప్పటి వరకు అంటే..!









