Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్

Land : అధికారుల నిర్లక్ష్యం.. భూమి మాయం..!

Land : అధికారుల నిర్లక్ష్యం.. భూమి మాయం..!

తూప్రాన్, మనసాక్షి :

అధికారుల నిర్లక్ష్యంతో రాజకీయ అండదండలతో తన కొడుకు పేరు మీద ఉన్న 6.15 గుంటల భూమిని అక్రమంగా ఓ రాజకీయ నాయకుడు తన భార్య,తల్లి పేరు మీద రికార్డు మార్పిడి చేశాడని రంగాయిపల్లి రైతు రామ్ రెడ్డి ఆరోపించారు. మనోహరబాద్ మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ

మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం రంగాయిపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 245, 248, 249 లలో తనకు ఉన్న 6.15 గుంటల భూమిని తన కొడుకు వేముల ప్రేమ్ కుమార్ రెడ్డి పేరు మీద 2007 లో రిజిస్టేషన్ చేయగా 2012 వరకు తన కొడుకు పేరు మీద చూపించిన భూమి 2013, 2014 లో రికార్డు లో పహాని లో కూడా చూపించకుండా పోవడంతో అనుమానం వచ్చి తను రికార్డ్ పరిశించగా తన పొలం ప్రక్కనే ఉన్న ఇతరుల పేరు మీద చూపిస్తుందని ఆరోపించారు.

ఓ రాజకీయ పార్టీ కి చెందిన నాయకుడు దుర్బుద్ధితో అన్యాయంగా తన కొడుకు పేరు మీద ఉన్న ఆస్తిని తల్లి, బార్య పేరుమీద మార్పిడి చేయించుకున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మార్వో దృష్టికి కూడా తీసుకెళ్ళానని అన్నారు. ఆర్డీఓ స్పందించి సదరు వ్యక్తికి నోటీస్ ఇవ్వడం జరిగింది అని అన్నారు. రికార్డ్ పరిశించిన తరువాత చర్యలు తీసుకోవాలని లేని పక్షం లో పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి కోర్టు కి కూడా వెళ్తానని రామ్ రెడ్డి తెలిపారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ ప్రభుత్వానికి ఊరట.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలనం..!

  2. Meals : అరటి ఆకులో భోజనం.. దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు, మీకు తెలుసా..!

  3. Meals : అరటి ఆకులో భోజనం.. దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు, మీకు తెలుసా..!

  4. Roti : రాత్రి మిగిలిన రోటీ పారేస్తున్నారా.. ఇలా చేస్తే అద్భుతం.. ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు