Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

కోడిపందాలపై డ్రోన్ల సహాయంతో పోలీసుల దాడులు.. ఐదుగురు అరెస్ట్..!

కోడిపందాలపై డ్రోన్ల సహాయంతో పోలీసుల దాడులు.. ఐదుగురు అరెస్ట్..!

రామసముద్రం, మనసాక్షి

అన్నమయ్య జిల్లా కోడిపందాలు, జూదం అరికట్టడానికి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి చేపట్టిన డ్రోన్ తో తనిఖీలు సత్పలితాలు ఇస్తున్నాయని ఎస్సై డి. రమేష్ బాబు తెలిపారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచిన రామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో పూలగుంట్ల పల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా జరుగుతున్న కోడిపందాలను గుర్తించా మన్నారు.

కోడిపంద్యం స్థావరం వద్దకు వెళ్లిన డ్రోన్‌ను చూడగానే, పందెంరాయుళ్లు ద్విచక్ర వాహనాలను అక్కడే వదిలేసి, కొండలు, గుట్టల గుండా పరుగులు తీస్తున్న వీరిలో ఐదు మందిని అదుపులోకి. తీసుకుని, సంఘటన స్థలం నుంచి ఆరు ద్విచక్ర వాహనాలు, ఒక పందెం కోడి స్వాధీనం చేసుకున్నామన్నారు.

డ్రోన్ ఆధారంగా పారిపోయిన మిగిలిన నిందితులను త్వరలోనే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. ఎంతటి వారైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఎన్నికల విధులు నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా నిర్వహించాలి..!

  2. Platelets : ప్లేట్‌లెట్స్ పడిపోయాయా.. అయితే ఇలా తిరిగి పొందండి ఈజీ..!

  3. Bike Driving : బైక్ నడిపేవారికి గుడ్ న్యూస్.. వెన్నునొప్పి తగ్గించే రహస్యాలు..!

  4. Gold Medal: గోల్డ్‌మెడల్ నుండి కొత్త పవర్ సొల్యూషన్స్..!

  5. Doctorate : న్యూడిల్లీ భారత్ యూనివర్సిటీచే ఈశ్వరయ్యకు డాక్టరేట్..!

మరిన్ని వార్తలు