తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుమెదక్

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ..!

కొల్చారం, మన సాక్షి

నిర్దేశిత వైద్య సేవలు సకాలంలో ప్రజలకు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఓపి రిజిస్టర్, సిబ్బంది హాజర పట్టిక, మందుల స్టాక్ ‌రిజిస్టర్ ఆసుపత్రి పరిసరాలు పరిశీలించి వైద్యాధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల కేసులు, వాటికి సంబంధించిన మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా. సీజనల్ వ్యాధుల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా అవసరమైన చర్యలు చేపట్టారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎల్లవేళలా వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణకు విశేష కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ NEWS : 

  1. Suryapet : సిఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఆ ప్రాజెక్టు దామోదర్ రెడ్డి పేరు..!

  2. District collector : విధుల పట్ల నిర్లక్ష్యం.. జిల్లా కలెక్టర్ సీరియస్, ప్రిన్సిపాల్ కు షోకాజ్..!

  3. Suryapet : పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే హెల్తీ ఫై ఆసుపత్రి లక్ష్యం..!

  4. Kissing : ముద్దు పెట్టుకుంటే ఇన్ని లాభాలా.. తెలుసుకోవల్సిందే..!

మరిన్ని వార్తలు