Nalgonda : పిన్ని కూతురిని గర్భవతిని చేసిన అన్న.. 21 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష..!

Nalgonda : పిన్ని కూతురిని గర్భవతిని చేసిన అన్న.. 21 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష..!
నల్లగొండ, మన సాక్షి.
తల్లిదండ్రులు చనిపోయారని తలదాచుకోవడానికి పెద్దమ్మ ఇంటికి వచ్చిన బాలికను ఆమె కొడుకు వావి వరసలు మరిచి అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఈ సంఘటన జూన్ 9 2021న చోటుచేసుకుంది. వివరాలకెళ్తే కట్టంగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో తలదాచుకోవడానికి నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడలో ఉంటున్న తన పెద్దమ్మ ఇంటికి వచ్చింది.
ఆమె పెద్దమ్మ మున్సిపాలిటీ స్వీపర్ కావడంతో తెల్లవారుజామున నాలుగు గంటలకే విధులకు వెళ్లిపోయేది ఒంటరిగా ఉన్న బాలికను సోదరుని వరుస అయ్యే నగేష్ ఆ బాలికపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక అక్కడి నుండి నార్కట్పల్లి మండలంలోని కాజా కుంట లో ఉండే తన మేనత్త ఇంటికి వెళ్ళింది. అక్కడ మేనత్త బాలిక లక్షణాలు చూసి అనుమానంతో ప్రశ్నించగా నల్లగొండలో తన పెద్దమ్మ ఇంటిలో ఉండే నగేష్ తనపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది.
మేనత్త వెంటనే నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫోక్సొ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కోర్టులోవాయిదాలు పడుతూ పడుతూ శుక్రవారం జడ్జి సంచలనమైన తీర్పునిచ్చింది బాలిక గర్భానికి కారణమైన నగేష్ కు 21 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష 25వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో సంవత్సరం జైలు శిక్షను ఖరార్ చేసింది.
అలాగే ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయలను బాలిక చెల్లించాలని తీర్పులో ఆదేశించారు కాగా. సరైన సాక్షాలను కోర్టులో ప్రవేశపెట్టిన నిందితునికి శిక్ష పడేలా చేసిన పి పి వేముల రంజిత్ కుమార్ దర్యాప్తు అధికారినీ. సురేష్ అప్పటికి వన్ టౌన్ సిఐ బాలగోపాల్ ప్రస్తుత డిఎస్పి శివరాం రెడ్డి ప్రస్తుత సీఐ రాజశేఖర్ రెడ్డి భరోసా అధికారి కల్పన అనుసంధాన అధికారులు నరేందర్ మల్లికార్జున్ లను ఎస్పీ శరత్చంద్ర పవర్ అభినందించారు.
MOST READ :
-
Miryalaguda : అకాల వర్షం.. నేలపాలైన వరి, అన్నదాతలకు తీవ్ర నష్టం..!
-
District Collector : జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులతో కలిసి భోజనం..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేద ప్రజలకు మరో భారీ శుభవార్త..!
-
Gold Price : బంగారం ధరలు ఎవరు నిర్ణయిస్తారో.. ఎలా నిర్ణయిస్తారో తెలుసా..!









