Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

Penpahad : గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం..!

Penpahad : గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం..!

పెన్ పహడ్, మన సాక్షి:

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు పరిశోధన కేంద్రంలో అభివృద్ధి చేసిన వరి విత్తనాలను క్యు ఎస్ ఇ వి అనే కార్యక్రమం ద్వారా నిర్వహించారు.

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని మహ్మదాపురం గ్రామంలో బి పి టీ 5204 వరి రకంపై క్షేత్ర దినోత్సవం సందర్భంగా బి పి టి 5204 రకం యొక్క గుణగణాలను రైతులకు తెలియజేశారు. క్యు ఎస్ ఇ వి సూర్యాపేట జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ వి. శ్రీధర్, సీనియర్ శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా స్థానం, కంపాసాగర్ వరిలో రైతు స్థాయిలో నాణ్యమైన విత్తనం ఉత్పత్తి ఎలా చేసుకోవాలో వివరించారు.

అదేవిధంగా వరిలో చీడపీడల యాజమాన్యాన్ని ఏ విధంగా చేసుకోవాలో రైతులకు వివరించారు.సరఫరా చేసిన వరి బహిరంగ మార్కెట్ లో అమ్ముకోకుండా అదే గ్రామం లో రైతులకు విత్తనంగా వాడుకోవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్, క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి వికాస్,సముద్రాల శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Chevella : మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్యకు నిరసన సెగ..!

  2. Alumni : మూడేళ్లు కలిసి చదువుకున్నారు.. 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు.. అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనం..!

  3. Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 21కి చేరిన మృతులు.. మృతుల వివరాలు ఇవే..!

  4. Nalgonda : గురుకులం విద్యార్థిని డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నం..!

మరిన్ని వార్తలు