Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్
Hyderabad : శంషాబాద్ లో లారీ లో మంటలు..!

Hyderabad : శంషాబాద్ లో లారీ లో మంటలు..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
శంషాబాద్ లోని కూరగాయల మార్కెట్ ముందున ఫ్లై ఓవర్ ఫై శుక్రవారం ఉదయం 5 గంటలకు లారీ లో మంటలు చెలరేగి దగ్ధమైంది.. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకేశాడు. దీంతో ఎలాంటి ప్రాణం నష్టం జరుగలేదు. ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి స్టేషన్ సిబ్బంది వెంటనే చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే లారీ ముందున్న క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :









