Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. వారికి రూ.లక్ష డొనేషన్..!

Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. వారికి రూ.లక్ష డొనేషన్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సంచల నిర్ణయం తీసుకున్నారు. ఆ విద్యార్థులకు లక్ష రూపాయల డొనేషన్ ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. గురువారం మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ నందు గురుకుల పాఠశాల, కళాశాల దామరచర్ల నందు నిర్వహించిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి పాఠశాల వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోటిల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శారీరకంగానే కాకుండా మానసికంగా బలంగా ఉండేందుకు ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహిస్తునందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేసారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం తెలంగాణ లో విద్య కు ప్రాధాన్యతనిస్తూ విద్యా విధానాన్ని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థులు అందరూ ధృడమైన సంకల్పంతో మంచిగా చదువుకొని మీ కుటుంబాలకు, మన మిర్యాలగూడ కి పేరు ప్రఖ్యాతలు తెలుకొని రావాలని కోరారు.

మిర్యాలగూడ నియోజకవర్గం లో గురుకుల విద్యార్థులు ఎవరైతే రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధిస్తారో వారికి లక్ష రూపాయల డొనేషన్ అందజేస్తానని ప్రకటించారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశం.. నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి..!

  2. District collector : అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు జమ చేయాలి..!

  3. Tasildar : తహసిల్దార్ సీరియస్ వార్నింగ్.. తరుగు, తాలు పేరుతో కటింగ్ చేయొద్దు..!

  4. Miryalaguda : వీరు మామూలోళ్లు కాదు.. మిర్యాలగూడలో గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్..!

మరిన్ని వార్తలు