Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

District collector : ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి..!

District collector : ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి..!

జగిత్యాల,(మన సాక్షి)

ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ లు మరియు ఆర్డీఓల తో కలిసి స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 24 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, బి.రాజగౌడ్, జగిత్యాల, మెట్ పల్లి, కోరుట్ల ఆర్డీఓలు మధు సూధన్, శ్రీనివాస్, జీవాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పరిశీలన..!

  2. Adhaar : రైతులకు ఆ సమయంలో ఆధార్ కార్డు వెంట తప్పనిసరి..!

  3. Cotton : నేటి నుండి పత్తి కొనుగోళ్లు నిరవదిక బంద్.. ఎందుకంటే..!

మరిన్ని వార్తలు