Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పరిశీలన..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పరిశీలన..!

టెక్మల్, మనసాక్షి :

నిరుపేదలకు కనీస నివాస గృహం ఉండాలన్న సంకల్పం తో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణలు జిల్లాలో వంద శాతం త్వరగా పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. టేక్మాల్ మండలంలోని సోమవారం కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పనులను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ అంశం మీద… సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ముందుగా అన్ని గ్రామాల వారీగా ఇంకా నిర్మాణాలు ప్రారంభించకుండా ఉన్న వాటి వివరాలను మండల స్థాయి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మండలంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సుమారు 55 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపు పూర్తి అయిందన్నారు.2,439 ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్ పూర్తి చేశారని,944 గోడలు పూర్తి చేశారని, 673 స్లాబుల స్థాయిలో ఉన్నాయన్నారు.

ఇప్పటివరకు 24 ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని, ఇప్పటికీ 15 ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించడం జరిగిందన్నారు.నిరుపేదలకు పక్కా ఇల్లు ఉండాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకువచ్చిందని జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు పురోగతి వేగం పెంచాలన్నారు.

మంజూరు అయిన ప్రతీ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు అసలు ఇంకా ఎందుకు నిర్మాణం చేపట్టలేదో అధికారులు క్షేత్ర స్థాయిలో వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు ఏమైన ఉంటే తెలుసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యి ఎవరైనా ఇంకా మొదలు పెట్టని వారి ఇండ్లు రద్దు చేసి ,అవసరం ఉన్న లబ్ది దారులకు ఇవ్వాలని హౌసింగ్ అధికారులకు సూచించారు.

మార్కింగ్ చేసినప్పటికీ ఇంకనూ బెస్మెంట్ నిర్మాణం చేయని లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకొని ఆ నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : మిర్యాలగూడలో మంత్రులు సుడిగాలి పర్యటన.. రూ.171 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..!

  2. TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..! 

  3. Cotton : నేటి నుండి పత్తి కొనుగోళ్లు నిరవదిక బంద్.. ఎందుకంటే..!

  4. Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. వారికి రూ.లక్ష డొనేషన్..!

మరిన్ని వార్తలు