Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : జిల్లా ఎస్పీ కీలక సూచన.. యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్ గా పనిచేయాలి..!

Narayanpet : జిల్లా ఎస్పీ కీలక సూచన.. యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్ గా పనిచేయాలి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నషా ముక్తా భారత్ అభియాన్ ఐదేళ్ల పూర్తి సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సామూహిక ప్రతిజ్ఞ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు అందరం కృషి చేద్దామని అన్నారు. ప్రజలు ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి పౌరుడు, ముఖ్యంగా ప్రతి పోలీసు, యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్ గా పనిచేయాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడితే మీ భవిష్యత్తు అంధకారం అవుతుందని చెప్పారు.

ఈ అలవాటు వ్యసనంగా మరి వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాదు కుటుంబం, సమాజం మొత్తాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. యువత భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిలో అవగాహన కల్పించాలని తెలిపారు. డ్రగ్స్ బారిన పడిన, రవాణా చేస్తున్న, అమ్మిన అట్టి వ్యక్తుల సమాచారం లోకల్ పోలీసులకు లేదా డయల్ 100 కి లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి సమాచారం ఇవ్వాలన్నారు.

సమాచారంఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆన్నారు. ప్రస్తుతం ప్రతి పోలీసు, ఇకనుండి యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్ గా పనిచేయాలని పిలుపునిచ్చారు. పోలీసులు స్కూల్స్, కాలేజీలలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్ రహిత జిల్లా కొరకు అందరు పాటుపడాలని కోరారు.
మాదకద్రవ్యాల నివారణలో పోలీసు–ప్రజల భాగస్వామ్యం కీలకమని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి ఎండి రియాజ్ హూల్ హాక్, డిఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, సిఐ శివ శంకర్, ఎస్సై లు వెంకటేశ్వర్లు, నరేష్, సురేష్, పురుషోత్తం, సునీత, పోలీస్ సిబ్బంది, డిపిఓ స్టాప్ తదితరులు పాల్గొన్నారు.

క్లిక్ చేసి ఈ వార్తలు కూడా చదవండి : 

  1. ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి చిక్కిన ఎస్సై రాజేష్..!

  2. Gold Price : బంగారం ధర ఒకేరోజు భారీగా రూ.17 వేలకు పైగా తగ్గింది.. కొనుగోళ్లకు ఇదే మంచి సమయం..!

  3. Cotton : నేటి నుండి పత్తి కొనుగోళ్లు నిరవదిక బంద్.. ఎందుకంటే..!

  4. Miryalaguda : ప్రారంభమైన ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు..!

మరిన్ని వార్తలు