Rice stick : వరి కొయ్యలు కాల్చుతున్నారా.. రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారులు..!

Rice stick : వరి కొయ్యలు కాల్చుతున్నారా.. రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారులు..!
సూర్యాపేట రూరల్, మనసాక్షి :
సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రిలో వరి కొయ్య కాలు కాల్చే అనర్ధాలపై రైతులకు సహాయ వ్యవసాయ సంచాలకులు జ్ఞానేశ్వరి దేవి అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. మెట్ట గాని మాగాని భూముల్లో ఎండు గడ్డిని దహనం చేయడం మంచిది కాదు. తద్వారా భూసారాన్ని కోల్పోతుంది. అవసరం లేని గడ్డిని భూమిలోనే కలియదున్నితే సేంద్రియ ఎరువుగా మారి భూమికి అవసరమైన పోషకాల్ని అందిస్తుందన్నారు.
వరి కోయాలను కాల్చవద్దని రైతులకు అవగాహన కల్పించారు. గడ్డి దహనంతో ఏర్పడే నష్టాలుకలకాలం దహనం చేయడం ద్వారా భూమి ఉండే ఉపకార్లు వేడికి నశిస్తాయి.
భూమికి సేంద్రియ పీచు పదార్థం ఉపయోగపడే అవశేషాలుగా కాలిపోతాయి భూసారం దెబ్బ తినడమే కాకుండా వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యానికి హాని ఏర్పడుతుంది. భూమిలో పంటలకు అవసరమైన ఖనిజాలు దెబ్బతింటాయి అన్నారు.
అయితే పరిష్కారం ఏమిటి? రైతులకు ఉపయోగపడే ప్రత్యామ్నాయాలు :
1. గడ్డిని పొలంలో కలిపి పచ్చి ఎరువుగా వాడటం దీని వల్ల నేలకి సహజంగా కార్బన్, పోషకాలు తిరిగి చేరి నేల బలంగా మారుతుంది.
2.మల్చర్, హ్యాపీ సీడర్ ఉపయోగించడం
గడ్డిని చిన్న తరగులుగా చేసి నేలమీద పరచవచ్చు. ఇది పోషకాలను పెంచడమే కాకుండా తడి ఎక్కువ రోజులు నిల్వ చేస్తుంది.
3. గోశాలలకు పశుగ్రాసంగా ఇవ్వడం
దీనివల్ల రైతుకు అదనపు ఆదాయమూ వస్తుంది.
4. బయోగ్యాస్/ బయోచార్ చేయించడం
ఇది వ్యవసాయానికి తిరిగి ఉపయోగపడే మంచి ఎరువు, ఇంధనం అందిస్తుంది.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్, ఏ ఈ ఓ స్వాతి, రైతుల పాల్గొన్నారు.
MOST READ :









