Elections : ఎన్నికల పరిశీలకులు కీలక ప్రకటన.. ఫిర్యాదుల నమోదుకు టోల్ ఫ్రీ నెంబర్..!

Elections : ఎన్నికల పరిశీలకులు కీలక ప్రకటన.. ఫిర్యాదుల నమోదుకు టోల్ ఫ్రీ నెంబర్..!
ఖమ్మం, మన సాక్షి :
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛ, న్యాయబద్ద నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు అన్నారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు, కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ లతో కలిసి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరగడానికి ఆస్కారం ఇవ్వవద్దని, స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణ జరగాలని స్పష్టం చేశారు. ఎం.సి.సి. నిబంధనలు ఉల్లంఘనలు జరగకుండా చూడాలని, అభ్యర్థులు వినూత్న రీతిలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తారని, దీనిని నిరోధించేందుకు పక్కా నిఘా పెట్టాలని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఎక్కడా కూడా ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం కావద్దని తెలిపారు. అభ్యర్థుల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని, తద్వారా ఎన్నికల పట్ల నమ్మకం పెరుగుతుందని, చిన్న ఫిర్యాదును కూడా నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు.
ప్రతి ఒక్కరు తమ విధులను పకడ్బందీగా నిర్వహిస్తూ బృందంగా పని చేయాలని, ఎన్నికలు పారదర్శకంగా జరగాలని అన్నారు. ఎఫ్.సి.టి., ఎస్.ఎస్.టి. ఏర్పాటు, ఫిర్యాదుల నమోదు టోల్ ఫ్రీ నెంబర్ 1077 పట్ల విస్తృతంగా ప్రచారం కల్పించాలని అన్నారు.
అనంతరం ఎన్నికల సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ పేపర్, ప్రింటింగ్ మెటీరియల్ మొదలగు వివిధ అంశాలకు సంబంధించిన అంశాలను సంబంధిత నోడల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సమీక్ష లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, ఎన్నికలకు సంబంధించి వచ్చే వివిధ ఫిర్యాదులను పరిశీలించి సమస్యలను పరిష్కరించేందుకు డిఆర్ఓ ఆధ్వర్యంలో వ్యవస్థ ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1077 పట్ల విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.
నామినేషన్లు ముగిసి అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత ప్రలోభాలు పెరిగే అవకాశం ఉందని, క్షేత్రస్థాయిలో బృందాలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎన్నికల ప్రచారంను తహసిల్దార్, ఆర్డిఓ రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని, కులాలు, మతాలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే రికార్డు చేసి నిబంధనలను ప్రకారం వారిని పోటీ నుంచి తొలగించే అవకాశం ఉంటుందని అన్నారు.
ఎన్నికల సిబ్బంది కేటాయింపు పోలింగ్ కేంద్రాల వారీగా 3వ ర్యాండమైజేషన్ సాధారణ పరిశీలకుల ఆధ్వర్యంలో చేపట్టాలని అన్నారు. ప్రస్తుత ఎన్నికలలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి నుంచి ఎన్నికలు ముగిసిన 45 రోజుల లోపు వ్యయం వివరాలు సేకరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని, ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు. కులాలు, మతాల మధ్య ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు ఉపేక్షించడం జరగదని అన్నారు.
ఈ సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఆర్ఓ పద్మశ్రీ, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, డిఆర్డిఓ సన్యాసయ్య, డీపీఓ ఆశాలత, డిపిఆర్ఓ ఎం.ఏ. గౌస్, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి టి. సునీల్ రెడ్డి, డిఈఓ చైతన్య జైని, సిపిఓ శ్రీనివాస్, ఆర్టీఓ వెంకట రమణ, డిసిఓ గంగాధర్, ఆర్డీఓ నరసింహా రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం. అపూర్వ, డిప్యూటీ సిఈఓ నాగ పద్మజ, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, ఈడిఎం. దుర్గాప్రసాద్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









