TET : తెలంగాణ టెట్ షెడ్యూల్ రిలీజ్.. పరీక్ష తేదీలు ఇవే..!

TET : తెలంగాణ టెట్ షెడ్యూల్ రిలీజ్.. పరీక్ష తేదీలు ఇవే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ టెట్ పరీక్ష షెడ్యూల్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ రిలీజ్ చేసింది. టెట్ పరీక్షలు ఆన్‌లైన్ మోడ్ లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు 2026 జనవరి 3వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తారు.
టెట్ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు ముందుగానే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రాలకు సరైన సమయానికి వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణలోని వివిధ జిల్లాలలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్షలో రెండు వేరు వేరు పేపర్లు ఉంటాయి. వీటిలో ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించే వారికి పేపర్ -1 పరీక్ష, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించే వారికి పేపర్ – 2 పరీక్ష ఉంటుంది.
MOST READ
-
SBI : నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. కొత్తగా 6,500 ఉద్యోగాలు..!
-
TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!
-
TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఇక నో టెన్షన్..!
-
Local Body Elections : అమ్మా నన్ను ఓటు వేసి దీవించు.. కాళ్లు మొక్కి ఓటు అడుగుతున్న సర్పంచ్ అభ్యర్థి..!









