Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Local Body Elections : అమ్మా నన్ను ఓటు వేసి దీవించు.. కాళ్లు మొక్కి ఓటు అడుగుతున్న సర్పంచ్ అభ్యర్థి..!

Local Body Elections : అమ్మా నన్ను ఓటు వేసి దీవించు.. కాళ్లు మొక్కి ఓటు అడుగుతున్న సర్పంచ్ అభ్యర్థి..!

చింతపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం తాను అహర్నిశలు కష్టపడి పనిచేసి గ్రామాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తానని బిజెపి, టిడిపి, బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కాశగోని వెంకటయ్య ఇంటింటా తిరుగుతూ ముమ్మర ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.

గ్రామంలోని ఓ వృద్ధురాలికి పాదాభివందనం చేసి నీ ఓటు నాకు కత్తెర గుర్తుపై వేసి దీవించు తల్లి అంటూ ఆమె ఆశీర్వాదాన్ని అందుకుంటున్నారు. గత మూడు రోజుల నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు చేపట్టి ప్రజా కళాకారులతో వాడవాడలా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

గతంలో తన తండ్రి కాశగోని మదర్ సర్పంచ్ గా గ్రామానికి సేవలందించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనకు కూడా ఈ ఒక్కసారి అవకాశం కల్పించి మీలో ఒకడిగా నన్ను కొడుకుగా, తమ్ముడు గా భావించి మీ అమూల్యమైన ఓటును తనకు అందించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వాడు కోరారు. తనకు పదవులు ముఖ్యం కాదని గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తానన్నారు.

ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉంటానని నిస్వార్థ సేవతో పని చేస్తారన్నారు. గ్రామంలో ఏ ఒక్కరికి ఆపద వచ్చిన తాను ఒక అన్నగా, తమ్ముడిగా ముందుండి కాపాడుకుంటానన్నారు. గ్రామ ప్రజలందరికీ ఆశీస్సులు తనపై మెండుగా ఉండాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కనిగిరి గోవర్ధన్, సందుపట్ల రాజేష్ సాగర్, గొట్టే పర్వతాలు, పల్లపు శ్రీను, అంకం శ్రీనివాస్, అంకం ప్రవీణ్,గోవింద్ రాజు,రాజు,అభి, కృష్ణ, వేణు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MOST READ :

  1. TG News : మెస్సీ.. మేస్త్రీ ఫుట్ బాల్ అంటూ హరీష్ రావు సంచలన కామెంట్స్..!

  2. Nalgonda : నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి..!

  3. Hyderabad : ఏడేళ్ల బాలుడిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం..!

  4. Holidays : విద్యా సంస్థలకు సెలవు..!

మరిన్ని వార్తలు