Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

TG News : మెస్సీ.. మేస్త్రీ ఫుట్ బాల్ అంటూ హరీష్ రావు సంచలన కామెంట్స్..!

TG News : మెస్సీ.. మేస్త్రీ ఫుట్ బాల్ అంటూ హరీష్ రావు సంచలన కామెంట్స్..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

మెస్సీతో ఈ మేస్త్రీ ఫుట్ బాల్ ఆడటానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు విమర్శించారు. 100 కోట్ల రూపాయలతో ఫుట్ బాల్ ఆడే కంటే పిల్లలకు ఏదైనా మంచి హాస్టల్ కట్టి కడుపునిండా మంచి ఆహారం పెట్టొచ్చని అన్నారు.

బాగ్ లింగంపల్లి గురుకుల పాఠశాలలో 90 మంది విద్యార్థులు కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైతే ముఖ్యమంత్రికి, మంత్రులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఒక్కరు కూడా ఆ పిల్లలను పరామర్శించలేదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అంతా ఫుట్ బాల్ ఆడటంలో బిజీగా ఉన్నారని ఆయన విమర్శించారు.

మరిన్ని వార్తలు