Breaking Newsజాతీయంతెలంగాణరాజకీయం

Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై కీలక పరిణామం.. స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు..!

తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో కీలక అంశం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారంటూ బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై కీలక పరిణామం.. స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో కీలక అంశం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారంటూ బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్ తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ను జత చేయాలని సూచించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది.

వారం రోజుల క్రితం ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా తెలిసిందే. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేయగా ఇప్పటివరకు ఏడు మంది ఎమ్మెల్యేల పిటిషన్ పై విచారణ జరిపిన స్పీకర్ మరో ముగ్గురి ఎమ్మెల్యేల విచారణ చేయాల్సి ఉంది. మిగిలిన ముగ్గురి అనర్హత పిటిషన్ పై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అల్టిమేట్ కూడా జారీ చేసింది. ఇదే చివరి అవకాశం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

ఈ వార్తలు కూడా చదవండి

మరిన్ని వార్తలు