Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డిరాజకీయం

Municipal Elections : కాంగ్రెస్ కు రెబల్స్ బెడద..!

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాల్టీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి రెబెల్స్ బెడద తీవ్రంగా ఉన్నది.

Municipal Elections : కాంగ్రెస్ కు రెబల్స్ బెడద..!

శంకర్‌పల్లి,, మన సాక్షి :

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాల్టీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి రెబెల్స్ బెడద తీవ్రంగా ఉన్నది. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ముగ్గురు చొప్పున నామినేషన్లు దాఖలు చేయగా.. అందులో ఒకరికి మాత్రమే పార్టీ బీఫారం దక్కడంతో మిగిలిన వారు పోటీ నుంచి వైదొలగడపోవడంతో ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ గుర్తులను కేటాయించింది.

మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో 1, 7, 8, 9, 13 వార్డులకు చెందిన రెబల్స్ కౌన్సిలర్ అభ్యర్థులు పోటీలో ఉండడంతో అధికార పార్టీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెబెల్స్ ప్రచారంలో దూసుకుపోవడంతో వెన్నులో వణుకుపుట్టిస్తున్నారు. రెబెల్స్ బెడదతో అధికార పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూసే అవకాశాలున్నాయి. అధిష్ఠాన నిర్ణయానికి వ్యతిరేకంగా బరిలో ఉన్న వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా ఫలితం లేదు.

మరిన్ని వార్తలు