Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణ

Breaking News : టాప్ 5.. మన సాక్షి ఫ్లాష్ న్యూస్..!

మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ పోర్టల్ మీకు ముఖ్యమైన వార్తలను అందిస్తుంది. ఉదయం ఎనిమిది గంటల ఫ్లాష్ న్యూస్ మీ ముందు..

Breaking News : టాప్ 5.. మన సాక్షి ఫ్లాష్ న్యూస్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ పోర్టల్ మీకు ముఖ్యమైన వార్తలను అందిస్తుంది. ఉదయం ఎనిమిది గంటల ఫ్లాష్ న్యూస్ మీ ముందు..

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం :

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్ లలో కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కిస్తారు.

హుజురాబాద్ స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్ :

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మున్సిపల్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్ అయింది. ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జరిగింది. హుజురాబాద్ లో స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టిన అధికారులు.

శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు :

ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు :

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం నాటికి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఊరేగింపులు, సభలను పోలీసులు నిషేధించారు.

అనారోగ్యంతో బీజేపీ అభ్యర్థి మృతి :

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలో బిజెపి అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ మృతి చెందింది. బత్తిని ఎల్లమ్మ బిజెపి అభ్యర్థిగా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 10వ వార్డులో పోటీ చేసింది. ఆమె శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందింది.

ఇవి కూడా చదవండి

  1. Doctorate : బ్రెయిన్ ట్యూమర్ గుర్తింపుపై పరిశోధన.. పుగళరసికి డాక్టరేట్..!

  2. పాతాళ త్రికోణ మహా సుందరి ఆలయంలో హీరో రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పూజలు..!

  3. MIRYALAGUDA : మిర్యాలగూడ మున్సిపోల్స్ లో  తగ్గిన పోలింగ్ శాతం.. వార్డుల వారీగా వివరాలు ఇవీ..!

  4. ACB : రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన యువ ఎస్సై..!

మరిన్ని వార్తలు