Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

కరెంట్ షార్ట్ సర్క్యూట్తో ఆహుతైన రేకుల కొట్టం..!

తుంగతుర్తి మండలం లోని మంచ్యాతండాలో ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమైన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. తండాకి చెందిన లాకావత్ అమ్ము కుమారుడు లాకావత్ సోమన్న వివాహం ఈనెల 26న జరగనుంది.

కరెంట్ షార్ట్ సర్క్యూట్తో ఆహుతైన రేకుల కొట్టం..!

తుంగతుర్తి మన సాక్షి :

తుంగతుర్తి మండలం లోని మంచ్యాతండాలో ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమైన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. తండాకి చెందిన లాకావత్ అమ్ము కుమారుడు లాకావత్ సోమన్న వివాహం ఈనెల 26న జరగనుంది. గుడిసె దగ్ధం కావడంతో పెండ్లికి సంబంధించిన బంగారు ఆభరణాలు, వస్త్రాలు, వస్తువులతో పాటు రెండు క్వింటాల బియ్యం.పెద్ద ఫ్రిడ్జ్ .రూ.2 లక్షలు నగదు డబ్బులు కాళీ బూడిద అయ్యాయి . ఈ ఘటన షార్ట్ సర్క్యూట తో జరిగిందని కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపారు. మా బీద కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇంటిలో ఇంకా ఎవరు లేని టైంలో కరెంటు వైర్ షార్ట్ సర్క్యూట్తో ఇలా మంటలు రావడం పూర్తిగా రేకుల కొట్టం ఖాళీ నష్టం భారీగా సుమారు 5 లక్షలకు దాటుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.  బాధితులు గ్రామస్తులుకన్నీటి పర్వంమయ్యారు.

MOST READ : 

మరిన్ని వార్తలు