Gold Price Today : మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర.. పసిడి ప్రియుల్లో ఆందోళన..!
బంగారం ధర ఇటీవల తగ్గుతూ వస్తుందని పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ సోమవారం మరోసారి భారీగా బంగారం ధర పెరిగింది. ఇటీవల నెల రోజులుగా బంగారం ధరలను పరిశీలిస్తే 10 గ్రాముల తులం బంగారం ఒక లక్ష 80 వేల రూపాయల వరకు చేరిన విషయం తెలిసిందే.

Gold Price Today : మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర.. పసిడి ప్రియుల్లో ఆందోళన..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర ఇటీవల తగ్గుతూ వస్తుందని పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ సోమవారం మరోసారి భారీగా బంగారం ధర పెరిగింది. ఇటీవల నెల రోజులుగా బంగారం ధరలను పరిశీలిస్తే 10 గ్రాముల తులం బంగారం ఒక లక్ష 80 వేల రూపాయల వరకు చేరిన విషయం తెలిసిందే.
కానీ ఆ తర్వాత మళ్లీ తగ్గుతూ ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు వచ్చింది. కాగా మరింత తగ్గుతుందని ఆశించిన పసిడి ప్రజలకు నిరాశ ఎదురయింది. మరోసారి భారీగా బంగారం ధర పెరిగింది. సోమవారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్ బంగారంకు 20,700 పెరిగింది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారంకు 19 వేల రూపాయలు పెరిగింది.
ఈరోజు తులం ఎంతంటే..?
సోమవారం (ఫిబ్రవరి 23)వ తేదీన హైదరాబాదులో 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర 2070 రూపాయలు తగ్గి 1,61,350 రూపాయలుగా ఉంది. అదే విధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారంకు 1900 రూపాయలు తగ్గి 1,47,900 రూపాయలుగా ఉంది. హైదరాబాదులో ఉన్న ఈ బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే కొనసాగుతున్నాయి.