Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లామహబూబ్‌నగర్విద్య

District collector : జిల్లా కలెక్టర్ సంచలన వ్యాఖ్య.. వాచీలతో పరీక్షా కేంద్రాల్లోకి.. అనుమతిస్తే చర్యలు..! 

పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో కి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు.

District collector : జిల్లా కలెక్టర్ సంచలన వ్యాఖ్య.. వాచీలతో పరీక్షా కేంద్రాల్లోకి.. అనుమతిస్తే చర్యలు..! 

నారాయణపేట టౌన్, మనసాక్షి :

పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో కి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. నారాయణ పేట మండలంలోని కోట కొండ జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో పరీక్షా సరళిని పరిశీలించారు.

కేంద్రాల్లో కొంత మంది విద్యార్థులు వాచ్ లు ధరించి వస్తున్నారని తెలిసిందని, పరీక్షా కేంద్రాలలోకి వాచ్ లు, ఇతర ఏ ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకు వెళ్ళేందుకు అనుమతి లేదని, సీ.ఎస్. డీ.వో లు, ఇన్విజిలేటర్ల కు సైతం కేంద్రాల్లో సెల్ ఫోన్లు తీసుకు వచ్చేందుకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు కూడా పరీక్షా కేంద్రం బయటే బందోబస్తు నిర్వహించాలన్నారు. అనంతరం శనివారం నాటి పరీక్ష కు ఎంత మంది విద్యా ర్థులు హాజరయ్యారని ఆయ న అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఈ.వో బాలాజీ, సీ.ఎస్.డీ.వో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు