Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nagarjuna Sagar : సాగర్ డ్యాం పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్..!

నాగార్జునసాగర్ ప్రాజెక్టును శనివారం నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా సాగర్ చేరుకున్న వీరు విజయ విహర్ సమావేశ మందిరంలో సాగర్ డ్యాం ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు.

Nagarjuna Sagar : సాగర్ డ్యాం పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్..!

నాగార్జునసాగర్, మన సాక్షి :

నాగార్జునసాగర్ ప్రాజెక్టును శనివారం నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా సాగర్ చేరుకున్న వీరు విజయ విహర్ సమావేశ మందిరంలో సాగర్ డ్యాం ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ డ్యాం అధికారులు సాగర్ డ్యాం భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్ డి ఎస్ ఏ అధికారులకు వివరించారు.

అనంతరం వీరు నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ ను, గ్యాలరీలను, డ్యామ్ గేట్లను పరిశీలించారు. ఎన్ డి ఎస్ ఏ చైర్మన్ నాగార్జునసాగర్ డ్యాం భద్రతపై తీసుకోవలసిన చర్యలపై డ్యాం అధికారులకు సూచనలు చేశారు. అనంతరం వీరు బుద్ధ వనాన్ని సందర్శించారు. వీరితోపాటు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు ఆదిత్య, గిరిధర్, నలగొండ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, సాగర్ డ్యాం ఎస్ ఇ మల్లికార్జున రావు, ఈ ఈ సీతారాం మరియు డ్యామ్ అధికారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు