TG : మాజీ సర్పంచ్ కిడ్నాప్.. పదిమంది అరెస్ట్..!
ఖమ్మం జిల్లా మండలంలోని పండ్రేగిపల్లి గ్రామానికి చెందిన సిల్వరాజును తేది :25 న ఉదయం 05:30 ల సమయం లో కిడ్నాప్ చేసిన ముద్దాయిలను ముదిగొండ పోలీస్ లు అరెస్టు చేసినారు.

TG : మాజీ సర్పంచ్ కిడ్నాప్.. పదిమంది అరెస్ట్..!
ముదిగొండ, (మనసాక్షి):
ఖమ్మం జిల్లా మండలంలోని పండ్రేగిపల్లి గ్రామానికి చెందిన సిల్వరాజును తేది :25 న ఉదయం 05:30 ల సమయం లో కిడ్నాప్ చేసిన ముద్దాయిలను ముదిగొండ పోలీస్ లు అరెస్టు చేసినారు. మార్చి 25 న ఉదయం 5:30 గం,,ల సమయంలో పండ్రెగుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ అలాగే ప్రస్తుత సర్పంచ్ భర్త అయిన పాము సిల్వరాజు ఉదయం తన ఇంటి నుండి బయలు దేరి ఉదయాన వాకింగ్ చేసుకుంటూ ఖానాపురం వైపు వేళ్తుండగా, వూరి చివరన గల బాబా సాహెబ్ మొక్కజొన్న చేను దగ్గరలోకి వెళ్ళేసరికి ఒక వాహనం (అశోక్ లైలాండ్ )గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినారు.
గత కొంతకాలంగా సిల్వరాజుపై అదే గ్రామానికి చెందిన షేక్ ఫక్రుద్దీన్ అతని కొడుకులు షేక్ బోధలు సాహెబ్, షేక్ ఖాసిం సాహెబ్ అనువారు వారి పాలివాండ్ల భూమి తగాదా విషయంలో మాట్లాడుతున్నాడని కోపంతో ఉన్నారని వారే సిల్వరాజును పాత కక్షలను మనసులో ఉంచుకొని.కిడ్నాప్ చేసి ఉంటారని సిల్వరాజు భార్య పాము స్వర్ణలత ఇచ్చిన పిర్యాదుపై ముదిగొండ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ అశోక్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కిడ్నాప్ ను సవాలుగా తీసుకున్న పోలీస్ లు ఖమ్మం రూరల్ ఎ సి పి ,బి. తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు, ముదిగొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ O. మురళి సారధ్యంలో టి. అశోక్,ఎస్ ఐ తో పాటుగా సిబ్బందిని రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి హైదరాబాద్ వారి లొకేషన్ ట్రేస్ చేస్తూ సిల్వరాజు ను గంటల వ్యవధిలోనే ట్రేస్ చేయటం జరిగినది.
పండ్రెగుపల్లి లో షేక్ ఇబ్రాహీం ,షేక్ ఫక్రుద్దీన్ అను అన్నతమ్ములకు (08) ఎకరాల భూమి పంపకాల విషయంలో తీదా ఉన్నది. షేక్ ఫక్రుద్దీన్ తన తల్లిదండ్రులను పట్టికోకుండా హైదరాబాద్ లో ఉంటున్నందున షేక్ ఇబ్రాహీం తన తల్లి దండ్రులను సాదినాడు.
తల్లిదండ్రులను సాది నందుకు ఆవూరిలో ఉన్న పెద్ద మనషులు షేక్ ఇబ్రాహీం కు (03) ఎకరాల భూమిని ఇవ్వమని చెపుతారు, అందులో సిల్వరాజు కూడా గట్టిగా షేక్ ఇబ్రాహీంకు సపోర్ట్ చేస్తాడు. ఈ సంవత్సరం జనవరి నెలలో షేక్ ఫక్రుద్దీన్ మరియు అతని కొడుకులు బోదల సాహెబ్ @ ముస్తఫా, షేక్ ఖాసిం సాహెబ్ కలిసి హైదరాబాద్ నుండి కిరాయి మనుషులని తీసుకు వచ్చి ఫెన్సింగ్ వేస్తుండగా, ఈ విషయం తెలిసి పాము సిల్వరాజు జనాలను తీసుకు వచ్చి ఫెన్సింగ్ వేయకుండా అడ్డుకున్నాడు. పాము సిల్వరాజు ప్రతి దాంట్లో అడ్డుపడుతున్నాడు.
అతను బతికి ఉండగా భూమి వారికి దక్కదని, అతడిని ఎలాగైనా అంతం చేయాలని వీరు ముగ్గురు తండ్రి కొడుకులు కలిసి పథకం పన్ని హైదరాబాద్ కు చెందిన బోదల్ సాహెబ్ స్నేహితులైన (1) సయ్యద్ మహమ్మద్ @ బాబా, (2) మెయిర్బాన్ సింగ్, (3) డంగి సిక్లికర్ కులజీత్ సింగ్, (4) డంగి సిక్లికర్ ఆజాద్ సింగ్, (5) ఇస్మాయిల్, (6) కోమల (7) MD. నూర్ (8) వరికుప్పల తారుణ్ అను ట్రాలీ ఆటో డ్రైవరు అను కిరాయి మనుషులను సిల్వరాజును చంపితే 15 లక్షలు శుపారీ ఇచ్చే విధంగా మాట్లాడినారు. ముందుగా 5 లక్షలు యిచ్చినారు.
వారు అనుకున్న పథకం ప్రకారంగా పై ఎనిమంది వ్యక్తులు ఒక అశోక్ లేలాండ్ ట్రక్ అలాగే ఒక స్విఫ్ట్ డిజైర్ వాహనంలో కత్తులు, ఇనుప రాడ్లు, పెట్రోల్ క్యాన్ వేసుకని తేదీ. 24 న రాత్రి బయలు దేరి తెల్లవారి అనగా తేదీ: 25 ఉదయం 05.30 గం,,ల సమయంలో సిల్వరాజు ఖానాపురం రోడ్డుకు వాకింగ్ కు వస్తాడని తండ్రీ కొడుకులు ఇచ్చిన సమాచారం మేరకు అతడి కోసం ఎదురు చూస్తుండగా సిల్వరాజు ఒంటరిగా నడుచుకుంటూ వస్తుండగా బలవంతంగా అతడిని వారి వాహనంలో ఎక్కించుకుని కొట్టుకుంటూ చంపుతామని బెదిరిస్తూ, ఎవరూ గుర్తు పట్టకుండా మధ్యలో స్విఫ్ట్ డిజైర్ వాహనంలోకి మార్చి అక్కడి నుండి కొట్టుకుంటూ హైదరాబాద్ తీసుకు వెళ్ళినారు.
ఇక్కడ బయలు దేరిన దగ్గర నుండి ప్రతి విషయం సయ్యద్ మహమ్మద్ @ బాబా, వీడియో తీస్తూ బోదల సాహెబ్ కు పంపిస్తూ, ఎక్కడ వరకు వచ్చింది ఫోన్ చేసి చెపుతున్నాడు. మధ్యలో ఒకసారి కుటుంబ సభ్యులతో బెదిరించి మాట్లాడించి, సిటీ మొత్తం తిప్పి ముదిగొండ పోలీస్ వారి చూపించిన చాకచక్యానికి ఎల్ బి నగర్ లో వదిలి వెళ్లిపోయినారు.
అప్పటినుండి ముద్దాయిల కోసం వెదుకుతుండగా, అందరూ కలిసి హైదరాబాద్ నుండి వైజాగ్ కు వారు ఉపయోగించిన వాహనాలలోనే పారిపోతుండగా, వారి కదళికలను పసిగట్టిన పోలీస్ వారు తెలదారుపల్లి టోల్ ప్లాజా వద్ద నేడు ఉదయం 08 గం,,లకు అరెస్ట్ చేసినారు. ముద్దాయిల వద్దనుండి ఒక అశోక్ లేలాండ్ ట్రక్, అలాగే ఒక మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్, రూ,, 1,05, 000/- ల నగదు , (08) సెల్ ఫోన్లు స్వాధీన పర్చుకోనైనది.
అరెస్ట్ అయిన వారి వివరాలు:
1- ముస్తఫా @ బోదల్ సాహెబ్ S/o ఫక్రుద్దీన్ వ,, 40 సం,,లు, కులం: ముస్లీం, రియల్ ఎస్టేట్ వ్యాపారం R/o సన్ సిటీ, బండ్లగూడ జాగీర్, రాజేంద్ర నగర్, హైదరాబాద్, N/o పండ్రెగుపల్లి గ్రామం, ముదిగొండ మండలం
2- షేక్ ఫక్రుద్దీన్ S/o నబీ సాహెబ్, వ,, 67 సం,,లు, కులం: ముస్లీం, వ్యవసాయం, R/o పండ్రెగుపల్లి గ్రామం, ముదిగొండ మండలం
3- షేక్ ఖాసిం సాహెబ్ S/o ఫక్రుద్దీన్, వ,, 41 సం,,లు, కులం: ముస్లీం, మెడికల్ ఎక్విప్మెంట్ సేల్స్ వ్యాపారం, R/o నాగోల్, ఎల్ బి నగర్, హైదరాబాద్, N/o పండ్రెగుపల్లి గ్రామం, ముదిగొండ మండలం
4- సయ్యద్ మహహమ్మద్ @ బాబా S/o మహబూబ్, వ,, 44 సం,,లు, కులం: ముస్లీం, కార్ డ్రైవరు, R/o రేతిబౌలీ, అత్తాపూర్, హైదరాబాద్
5- డంగి మయిర్బాన్ సింగ్ S/o తారా సింగ్, వ,, 28 సం,,లు, కులం: సికిల్కర్, వెల్డింగ్ పని, R/o H. No. 2-231, శ్రీనగర్ కాలనీ, బాలాజీ నగర్, పాతహఫీజ్ పేట, తిరుమలగిరి, మియాపూర్,
6- డంగి సిలికర్ కుల్జీత్ సింగ్ S/o మనోహర్ సింగ్, వ,, 23 సం,,లు, కులం: సికిల్కర్, వెల్డింగ్ పని, R/o జవహర్ నగర్, బాలాజీ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్
7- సిలికర్ ఆజాద్ సింగ్ S/o మనోహర్ సింగ్, వ,, 21 సం,,లు, కులం: సికిల్కర్, వెల్డింగ్ పని, R/o జవహర్ నగర్, బాలాజీ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్
8- సయ్యద్ ఇస్మాయిల్ S/o బాబు మియా, వ,, 37 సం,,లు, కులం: ముస్లిం, పెయింటింగ్ పని, R/o కౌకూర్, భరత్ నగర్, వాంబేకాలనీ, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్
9- రొక్కం కోమల W/o దేవేందర్, వ,, 38 సం,,లు, కులం: మాల (SC), కూలీ పని, R/o కౌకూర్, భరత్ నగర్, వాంబేకాలనీ, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్
10- వరికుప్పల తరుణ్ S/o సత్తెయ్య, వ,, 26 సం,,లు, కులం: వడ్డెర, అశోక్ లేలాండ్ ఓనర్/ డ్రైవరు నెం. TG 08 V 4790, R/o గబ్బిలాల్ పేట, జవహర్ నగర్, కౌకూర్, భరత్ నగర్, వాంబేకాలనీ, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్.









