Additional Collector : ఆడిషనల్ కలెక్టర్ కిలక సూచన.. మహిళలు ఆర్థికంగా బలపేతం కావాలి..!
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫణిందర్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లాలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల యూనిఫామ్ కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు బుధవారం పురపాలక సంఘ కార్యాలయం ఆవరణలో ధ్రువపత్రాలు పంపిణీ చేశారు.

Additional Collector : ఆడిషనల్ కలెక్టర్ కిలక సూచన.. మహిళలు ఆర్థికంగా బలపేతం కావాలి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫణిందర్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లాలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల యూనిఫామ్ కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు బుధవారం పురపాలక సంఘ కార్యాలయం ఆవరణలో ధ్రువపత్రాలు పంపిణీ చేశారు.
ఇట్టి కార్యక్రమానికి హాజరైన అడిషనల్ కలెక్టర్ ఫణిందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో గల మహిళా గ్రూప్ సభ్యులకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫార్మ్స్ కుట్టించుటకు కావాల్సిన నైపుణ్యతను కల్పించుటకు జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన మహిళా గ్రూపు సభ్యులకు యూనిఫామ్ కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ లో నిర్వహించడం జరిగింది.
నాలుగు మున్సిపాలిటీ లకు సంబంధించిన 130 మంది మహిళా గ్రూప్ సభ్యులు యూనిఫార్మ్స్ కుట్టుటకు కావాల్సిన శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత సత్య యాదవ్
మాట్లాడుతూ మహిళలు పొందిన శిక్షణను ఉపయోగించుకొని ముందుకు సాగాలని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకొని అన్ని రంగాలలో ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలిపారు.
అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగాలని, బ్యాంకు లింకేజీ ద్వారా వస్తున్న రుణాలను ఉపయోగించుకొని
చిరు వ్యాపారాలు చేసి ముందుకెళ్లాలని కోరారు. అదేవిధంగా వైస్ చైర్ పర్సన్ ఎన్ మంజుల మహిళలు కేవలం కుట్టు మిషన్ల కాకుండా బ్యూటీ పార్లర్ నేర్చుకుని ఆ రంగంలో కూడా ఆర్థికంగా బలోపేతం కావచ్చు అని తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో కౌన్సిలర్ బండి రాజేశ్వరి, మెప్మా ద్వారా శిక్షణ అందించిన ఏజెన్సీ ఆర్గనైజర్ సునీత, పట్టణ మహిళా అధ్యక్షురాలు సాయికుమారి, మున్సిపల్ మేనేజర్ అజీమ్, రాజు, జ్యోతి ఆర్ పి లు పాల్గొన్నారు.