Power cut : రేపు నారాయణపేటలో విద్యుత్ కోత.. వేళలు ఇవే..!
నారాయణపేట మండల కేంద్రం మండలంలోని పలు గ్రామాలలో రేపు విద్యుత్ కోత విధించనున్నారు

Power cut : రేపు నారాయణపేటలో విద్యుత్ కోత.. వేళలు ఇవే..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట మండలం చిన్న జట్రం, కొల్లంపల్లి 33/11 కె.వి. ఉప విద్యుత్ కేంద్రాలకు శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నాలుగు గంటల పాటు విద్యుత్తు అంతరాయం ఉంటుందని గ్రామీణ ఏఈ. సాయినాథ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
33/11 కె.వి. లైన్ మరమ్మత్తుల, ట్రీ కటింగ్ ఉన్నఝదున ఈ రెండు ఉప విద్యుత్ కేంద్రాలకు విద్యుత్ సరఫరా ఉండదని కావున ఈ ఉప విద్యుత్ కేంద్రాల పరిధిలో ఉన్న గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని, రైతులు విద్యుత్ వినియోగదారులు ఈ అంతరానికి సహకరించాలని ఏఈ కోరారు.
చిన్న జట్రం ఉప విద్యుత్ కేంద్రం పరిధిలో లక్ష్మి పూర్ , బోయిన్ పల్లి, అయ్యా వారిపల్లి , అంత్వర్, నల్లగుట్ట తాండా, సాముల వారి తాండ, కొల్లంపల్లి ఉప విద్యుత్ కేంద్రం పరిధిలో లింగం పల్లి , కోల్లంపల్లి తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ సాయినాథ్ రెడ్డి తెలిపారు.









