Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Suryapet : సూర్యాపేటలో దారుణం.. బంగారం కోసం వృద్దురాలి హత్య..!
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 28వ వార్డులో వృద్ధురాలి ఇరుగు పాపమ్మ దారుణ హత్య కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఆమెను హతమార్చి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు.

Suryapet : సూర్యాపేటలో దారుణం.. బంగారం కోసం వృద్దురాలి హత్య..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 28వ వార్డులో వృద్ధురాలి ఇరుగు పాపమ్మ దారుణ హత్య కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఆమెను హతమార్చి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న ఎస్సైలు ఐలయ్య, ఏడుకొండలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.









