Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : సాగర్ రోడ్డు, నేషనల్ హైవే పై యూ టర్న్ డైవర్షన్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని సాగర్ రోడ్, నేషనల్ హైవే హనుమాన్ పేట సాయిబాబా గుడి ఆర్చి, LIC ఆఫీస్ ముందు యు టర్న్ డైవర్షన్ కల్పించాలని కోరుతూ స్థానిక శాసనసభ్యులు పాత్ర లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు.

Miryalaguda : సాగర్ రోడ్డు, నేషనల్ హైవే పై యూ టర్న్ డైవర్షన్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని సాగర్ రోడ్, నేషనల్ హైవే హనుమాన్ పేట సాయిబాబా గుడి ఆర్చి, LIC ఆఫీస్ ముందు యు టర్న్ డైవర్షన్ కల్పించాలని కోరుతూ స్థానిక శాసనసభ్యులు పాత్ర లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు.

స్థానిక 21,22, 23, 24 వార్డు కౌన్సిలర్స్ పద్మాశెట్టి లక్ష్మి కోటేశ్వర్ రావు, వెలుగు ఇందిరా నాగరాజు, తీరంశెట్టి కోటి, brs మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇలియాస్, మాజీ కౌన్సిలర్ చిలుకూరి రమాశ్యామ్, సాయిబాబా గుడి అధ్యక్షులు గౌరు దయాకర్, కూరపాటి సాంబశివరావు నీలా పాపారావు, పెండ్యాల పద్మ, కొంగరి కిరణ్, కడియం సైదులు, పాలేటి వంశీ లు కలిసి స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ యు టర్న్ వల్ల హనుమాన్ పేట, వాసవి నగర్, కూర్చున్న గాంధీ బొమ్మ, అశోక్ నగర్, శివాజీ నగర్, రైల్వేస్టేషన్, నాగార్జుననగర్, రెడ్డికాలనీ, సాయినగర్, బైపాస్ ఏరియాలకు ఈ డైవర్షన్ చాలా ముఖ్యమైంది కావున ప్రజలు ఇబ్బందులను గుర్తించి ఈ యు టర్న్ ను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుప్పాల సుబ్బారావు, మేడి నవీన్, సైదులు, మేకల రవి, మందడి మధు, నాల్ల యాదయ్య, తొండపు బాబు లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు