Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంకరీంనగర్జిల్లా వార్తలు

District Collector : జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

విద్యార్థుల భద్రతకు, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ వసతిగృహాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సిబ్బందిని ఆదేశించారు.

District Collector : జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

కరీంనగర్, మనసాక్షి :

విద్యార్థుల భద్రతకు, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ వసతిగృహాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం చొప్పదండిలోని ఎస్సీ సంక్షేమ శాఖ వసతి గృహాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, మరుగుదొడ్లు, డార్మెటరీ హాల్, భోజనశాల పరిశీలించారు. మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. సిబ్బంది హాస్టల్లోనే ఉండాలని.. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిపిఓ జగదీశ్వర్, తహసిల్దార్ నవీన్ కుమార్, వార్డెన్ కుమారస్వామి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు