Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : మంత్రి ఉత్తమ్ ను విమర్శించే అర్హత లేదు..!

తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర పౌరసరఫరాలు నీటి పారుదల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని దుర్భాషలాడిన బీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డీసీసీ జనరల్ సెక్రటరీ చిలుకూరి బాలకృష్ణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు దేశిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. డిమాండ్ చేశారు.

Miryalaguda : మంత్రి ఉత్తమ్ ను విమర్శించే అర్హత లేదు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు మిర్యాలగూడ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశం లో మాట్లాడారు. రాష్ట్రంలోని సీనియర్ శాసనసభ్యునిగా.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మచ్చలేని నాయకుడిగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే నేతగా ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తున్న నాయకుడన్న విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అన్నారు. విమర్శించే అర్హత ఒంటెద్దు నరసింహారెడ్డికి లేదన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, జావీద్, ఆవుట శ్రీనివాస్, మనోజ్, చక్రపాణి, బూడిద సైదులు, కాంగ్రెస్ నాయకులు బంటు లక్ష్మీనారాయణ, గొట్టిముక్కల లక్ష్మణ్, షేక్ అబ్దుల్లా, మణికంఠ, ఇంమ్రాన్, సోమగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు