Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి..!

ప్రమాదశాత్తు తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.

Suryapet : తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి..!

సూర్యాపేట,(రూరల్), మన సాక్షి:

ప్రమాదశాత్తు తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సూర్యాపేట మండల పరిధిలోని కాసరబాద్ గ్రామానికి చెందిన పోలగాని శీను…వృత్తిరీత్యా రోజు మాదిరిగా తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషాదకరమైన సంఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని వార్తలు