Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా
MPDO : కంగ్టి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్..!
కంగ్టి మండల పరిషత్ ఇంచార్జ్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) గా మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు.

MPDO : కంగ్టి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్..!
కంగ్టి, మన సాక్షి :
కంగ్టి మండల పరిషత్ ఇంచార్జ్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) గా మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం ఇక్కడ పనిచేసిన ఎంపీడీవో సత్తయ్య డిప్యూటీ సీఈవోగా పదోన్నతి పొందారు. ఆయన వికారాబాద్ జిల్లా అడిషనల్ డిఆర్డివోగా బదిలీ కావడంతో ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యారు. నూతన ఎంపీడీవో గా మండల పంచాయతీ అధికారి లక్ష్మణ్ ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా నూతన ఎంపీడీవో మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ ప్రభుత్వం ప్రజలకు అందజేసే సంక్షేమ పథకాలు అభివృద్ధి, కార్యక్రమాలు సత్వరమే అందేలా కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు. మండలంలో అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు సహకరించాలన్నారు.









