Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లాహైదరాబాద్

TS News: జమ్ము కాశ్మీర్ లో కరాటే లో సత్తా చాటిన లోహిత్ మణి..!

పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ డివిజన్ కు చెందిన జమ్మూ & కశ్మీర్ లో నిర్వహించిన కరాటే ప్రీమియర్ లీగ్ నేషనల్ లెవల్ టోర్నమెంట్ లో ఎస్ఎస్ కె ఐ టీమ్ అద్భుత ప్రదర్శన చేసి ఘన విజయాన్ని నమోదు చేసింది.

TS News: జమ్ము కాశ్మీర్ లో కరాటే లో సత్తా చాటిన లోహిత్ మణి..!

పటాన్చెరు, (మనసాక్షి):

పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ డివిజన్ కు చెందిన జమ్మూ & కశ్మీర్ లో నిర్వహించిన కరాటే ప్రీమియర్ లీగ్ నేషనల్ లెవల్ టోర్నమెంట్ లో ఎస్ఎస్ కె ఐ టీమ్ అద్భుత ప్రదర్శన చేసి ఘన విజయాన్ని నమోదు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారుల మధ్య జరిగిన ఈ పోటీల్లో ఎస్ఎస్ కె ఐటీమ్ క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపిస్తూ గోల్డ్ మెడల్ లోహిత్ కైవసం చేసుకున్నాడు.

ఈ విజయంతో గండిపేట్ పరిసర ప్రాంతాల్లో క్రీడాభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.ఈ టోర్నమెంట్ లో ఎస్ఎస్ కె ఐ టీమ్ మొత్తం 7 గోల్డ్ మెడల్స్, 8 సిల్వర్ మెడల్స్, 9 బ్రాంజ్ మెడల్స్ సాధించి జాతీయ స్థాయిలో తమ స్థాయిని చాటింది. ప్రతి విభాగంలో క్రీడాకారులు ధైర్యంగా పోరాడి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. ముఖ్యంగా ఫైనల్ రౌండ్లలో చేసిన ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ విజయాల్లో ప్రత్యేకంగా తెల్లాపూర్ కు చెందిన లోహిత్ అద్భుతంగా రాణించి ఒక సిల్వరెమెడల్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించడం విశేషం. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడం ద్వారా తన గ్రామానికి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు. లోహిత్ మణి ప్రదర్శనను చూసిన క్రీడా నిపుణులు అతడికి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ విజయానికి మార్గనిర్దేశం చేసిన మాస్టర్ అనిల్ కుమార్ పాత్ర ఎంతో కీల కమని క్రీడాకారులు తెలిపారు.

ఆయన శిక్షణ, క్రమశిక్షణ, నిరంతర ప్రోత్సా హంతోనే ఈ ఘన విజయం సాధ్యమైం దని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ ఎస్.కె. ఐ టీమ్ సభ్యులకు, విజేతలకు స్థానిక క్రీడాభిమానులు, గ్రామ పెద్దలు అభినందనలు తెలుపుతూ భవిష్యత్తు లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు