Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఉద్యోగంతెలంగాణ

TS News: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది.

TS News: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 290 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీర్, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, కాలుష్య నియంత్రణ మండలి లో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ వెలువడింది.

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీర్ పోస్టులకు ఈనెల 6వ తేదీ నుంచి జూలై 13 వ తేదీ వరకు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులకు ఈనెల 8వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు, కాలుష్య నియంత్రణ మండలి లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు ఈనెల 10వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చునని టీజీపీఎస్సీ కార్యదర్శి హరిత ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు