Miryalaguda : ఎస్వీ మోడల్ స్కూల్ పూర్వ విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో విశిష్ట ప్రతిభ..!
మిర్యాలగూడ పట్టణంలోని ఎస్ వి మోడల్ హై స్కూల్ పూర్వ విద్యార్థిని ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి, 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకు పొందింది.

Miryalaguda : ఎస్వీ మోడల్ స్కూల్ పూర్వ విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో విశిష్ట ప్రతిభ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని ఎస్ వి మోడల్ హై స్కూల్ పూర్వ విద్యార్థిని గోరుంట్ల శ్రావణి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి, 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకు పొందింది.
విద్యార్థిని సాధించిన ఈ ఘన విజయం పాఠశాలకు, తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు గర్వకారణమని పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యామ్ సుందర్ తెలిపారు. విద్యార్థిని కృషి, పట్టుదల, ఉపాధ్యాయుల సమర్థమైన మార్గదర్శకత్వం మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ అద్భుత విజయాన్ని సాధించగలిగిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థినికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే ఈ విజయం ప్రస్తుత విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు.









