Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
నల్లబండగూడెంలో ఉపాధి హామీ కూలీ మృతి
కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామం లో ఉపాధి హామీ పని కోసం వెళ్లిన కూలీ వేముల పుల్లమ్మ( 56) పని స్థలం లోనే మృతి చెందింది. రొజు వారి మాదిరిగానే శుక్రవారం కూడ కరువు పనికి వెళ్ళింది పని చేస్తూనే ఒక్క సారిగా కుప్పకూలింది.

నల్లబండగూడెంలో ఉపాధి హామీ కూలీ మృతి
కోదాడ, మనసాక్షి :
కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామం లో ఉపాధి హామీ పని కోసం వెళ్లిన కూలీ వేముల పుల్లమ్మ( 56) పని స్థలం లోనే మృతి చెందింది. రొజు వారి మాదిరిగానే శుక్రవారం కూడ కరువు పనికి వెళ్ళింది పని చేస్తూనే ఒక్క సారిగా కుప్పకూలింది. ఉపాధి హామీ కూలీ మృతిచెందిన విషయం ఫీల్డ్ అసిస్టెంట్ పై అధికారులకు సమాచారం అందించారు.
కోదాడ ఎంపీడీఓ ఇసాక హుస్సేన్, ఎం పి ఓ,ఉపాధి హమి సిబ్బంది తో కలిసి పని ప్రదేశం పర్శిలించి సంఘటన కు సంబందించిన వివరాలు గ్రామస్తుల ను అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన విషయం ఉన్నత అధికారులకు తెలియజేసి మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. తమతో నే పనిచేస్తూన్న తోటి కూలీ మృతి చెందడం పట్ల కూలీలు, కుటుంబం సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.









